కూటమి అభ్యర్థుల విజయానికి విజయనగరం కార్పొరేషన్లో ముమ్మర ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయనగరం
విజయనగరం కార్పొరేషన్ పరిధిలో పదో ఐదో డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం జోరుగా సాగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు. సైకిల్, గ్లాస్ అలాగే కమలం గుర్తులపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.