'ఈశ్వర్ లేకపోతే బతకలేను..': జానపద కళాకారుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం
రిపోర్టర్: గోపి
స్థలం: తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. ఈ వివాదంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఈశ్వర్ సాయి భార్య శరణ్య బలవన్మరణానికి యత్నించింది. ఈశ్వర్ లేకపోతే తాను బతకలేనంటూ ఆడియో మెసేజ్ విడుదల చేసి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించగా, కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని సమాచారం.