కశ్మీరీ పండిట్లకు తీపి కబురు: లోయలో భారీ వసతి గృహాలు ప్రారంభం

రిపోర్టర్: రాజేష్ స్థలం: శ్రీనగర్

కశ్మీర్ లోయలో ప్రధాన మంత్రి ప్యాకేజీ ఉద్యోగుల కోసం నిర్మించిన వెయ్యి నాలుగు వందల పదహారు ట్రాన్సిట్ అకామడేషన్ ఫ్లాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. కశ్మీరీ పండిట్ కుటుంబాల గౌరవప్రదమైన పునరావాసానికి ఇది కీలక మైలురాయి అని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్ ఆత్మను కోల్పోయిందని, పండిట్ల రాకతోనే ఈ ప్రాంతపు సాంస్కృతిక వైభవం పరిపూర్ణమవుతుందని సిన్హా పేర్కొన్నారు.