పాకిస్థాన్ తొలి స్వదేశీ క్షిపణి పరీక్ష: ఫాజ్ ప్రయోగం విజయవంతం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఇస్లామాబాద్
పాకిస్థాన్ దేశం మొదటిసారిగా స్వయంగా అభివృద్ధి చేసిన ఫాజ్ గాలి నుండి గాలిలోకి దూసుకుపోయే క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని సైనిక అధికారులు, శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ క్షిపణి గాలిలోని లక్ష్యాలను ఛేదించగలదని, వైమానిక దళ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని అధికారులు తెలిపారు. అయితే దీని పరిధి, వేగానికి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు.