అరుణాచల్ ప్రదేశ్లో ఉగ్రదాడి అస్సాం రైఫిల్స్ జవాన్ మృతి

రిపోర్టర్: రాము స్థలం: ಅరుణಾಚಲ ಪ್ರದೇಶ

అరుణాచల్ ప్రదేశ్లోని చాంగ్లాంగ్ జిల్లాలో భారత్-మయన్మార్ సరిహద్దు వెంబడి గస్తీ నిర్వహిస్తున్న అస్సాం రైఫిల్స్ బృందంపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో హవిల్దార్ జంఖోకై కుకీ మరణించగా, మరో నలుగురు సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. నాంపాంగ్ సర్కిల్ పరిధిలో సరిహద్దు కంచె పనులు జరుగుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి పాల్పడింది ఎన్ఎస్సిఎన్ మిలిటెంట్లుగా ప్రాథమికంగా గుర్తించిన భద్రతా బలగాలు, ఆ ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి.