దిల్లీ డిక్లరేషన్‌లో పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిక్స్ దేశాలు
రిపోర్టర్: రాము
స్థలం: New Delhi
బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో 'దిల్లీ డిక్లరేషన్ 2026'ను సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని బ్రిక్స్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదం పట్ల జీరో టోలరెన్స్ విధానాన్ని ప్రధాని మోదీ దౌత్య నైపుణ్యంతో ఈ వేదికపై మరోసారి స్పష్టం చేశారు. అంతర్జాతీయ వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని బ్రిక్స్ స్పష్టం చేసింది.