ప్రభుత్వ కార్యాలయంలో వ్యక్తిగత వాహనాలకు విద్యుత్ చార్జింగ్ వ్యవహారం

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజాధనంతో నిర్వహించే విద్యుత్ వనరులను ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వ వనరులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించడంపై అధికారులు తక్షణమే స్పందించి స్పష్టతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు.