పాడేరులో కొట్టుకుపోయిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డుపై గిరిజనుల ఆగ్రహం
రిపోర్టర్: మహేష్
స్థలం: పాడేరు
అల్లూరి జిల్లా పాడేరులో ఇటీవల నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోవడంపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో నాణ్యతా లోపంతోనే రోడ్లు దెబ్బతింటున్నాయని వైఎస్సార్సీపీ మండిపడింది. నాసిరకం పనులపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.