వి విజయనగరం జిల్లా ఆసుపత్రుల్లో ఎక్స్‌రే యూనిట్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం

రిపోర్టర్: విజయ్ స్థలం: విజయనగరం

విజయనగరం ఉమ్మడి జిల్లాలోని పలు సామాజిక, ప్రాంతీయ ఆసుపత్రులలో జాతీయ హెల్త్ మిషన్ నిధులతో మంజూరైన ఎక్స్ రే యూనిట్ల ఏర్పాటు రెండేళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. ఏపీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో యంత్రాలు మంజూరైనప్పటికీ, భవనాల్లో లెడ్ తలుపుల ఏర్పాటు మరియు నిధుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఈ యంత్రాలు బిగించకపోవడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం గగనంగా మారింది.