సచివాలయంలో విత్తన మట్టి గణపతుల ఉచిత పంపిణీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
అమరావతి సచివాలయంలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మూడు వేల విత్తన మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. రసాయన విగ్రహాలతో కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ స్ఫూర్తితో ప్రజలంతా పర్యావరణహితంగా వినాయక చవితి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.