నాగార్జునసాగర్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లలో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: నాగార్జునసాగర్

నాగార్జునసాగర్ పైలాన్ కాలనీ సమీపంలోని కొత్త వంతెనపై సుమారు 40 మీటర్ల ఎత్తులో ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ శాఖల సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి విగ్రహాలను కృష్ణానదిలోకి తోస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టేజీ చుట్టూ రక్షణ కంచె, హ్యాండ్‌రైల్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.