టీచర్ల జోలికొస్తే దబిడి దిబిడే అంటూ జగన్‌కు మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

రిపోర్టర్: అశోక్ స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ వైఎస్సార్సీపీ అధినేత జగన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉపాధ్యాయుల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టబోమని, రెడ్‌ బుక్‌ ద్వారా తగిన మూల్యం చెల్లించుకుంటారని ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. విజయవాడలో టీచర్లపై జరిగిన దాడులను ఖండించిన లోకేశ్, డీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు మద్యం కుంభకోణాలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.