ఢిల్లీలో పోలీసుల దాష్టీకంపై జర్నలిస్ట్ తులసి చందు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
పోలీసుల కళ్ల ముందే ఆర్ఎస్ఎస్ కండువాలతో ఆందోళన చేస్తున్న టీనేజర్లపై దాడులు జరగడం దారుణమని, బాలికను అత్యంత దారుణంగా కొట్టిన పోలీసుల తీరుపై స్వతంత్ర గ్రౌండ్ జర్నలిస్ట్ తులసి చందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న గూండాల్లో ఎంత మందిని పోలీసులు డిటైన్ చేశారని ఆమె నిలదీశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ఇలాంటి హింసను ఎలా సమర్థించుకుంటారని ఢిల్లీ పోలీసుల పనితీరును ప్రశ్నిస్తూ ఆమె సామాజిక మాధ్యమాల్లో వీడియోను పంచుకున్నారు.