శ్మశానానికి దారి లేదు: పొలాల గుండా మృతదేహాల తరలింపు

రిపోర్టర్: రమేష్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా పందులవానివలసలో శ్మశానానికి వెళ్లే దారిని కొందరు ఆక్రమించడంతో గిరిజనులు నరకయాతన పడుతున్నారు. మృతదేహాలను బురద పొలాలు, వాగుల గుండా మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలను తొలగించి, శాశ్వత రహదారిని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదమైన వీడ్కోలు దక్కడం లేదని గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.