గొంగటి రఘునాథరెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: వింజమూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మండల కన్వీనర్, మాజీ సొసైటీ చైర్మన్ గొంగటి రఘునాథరెడ్డి మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతికకాయానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నివాళులర్పించారు. అనంతరం రఘునాథరెడ్డి అంతిమయాత్రలో స్వయంగా పాల్గొని తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.