అహ్మదాబాద్‌లో పరువు హత్య కలకలం, కూతురిని కడతేర్చిన తండ్రి, కొడుకు
రిపోర్టర్: నరేష్
స్థలం: గుజరాత్
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణ పరువు హత్య వెలుగు చూసింది. సోఫియా ఫరూక్ అనే 22 ఏళ్ల యువతితో ఒక యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కుటుంబ పరువు పోయిందన్న కసితో తండ్రి మహమ్మద్ ఫరూక్, సోదరుడు హబిల్ ఫరూక్ కలిసి ఆమెను సుత్తితో కొచ్చి హత్య చేశారు. ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా నమ్మించేందుకు నిందితులు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు ఛేదించి, తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు.