స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలి: చింతపల్లిలో BCY పార్టీ పిలుపు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో జరిగిన బీసీవై పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా శ్రమించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.