కాకాణి కుటుంబం ప్రభుత్వ భూములను బినామీలతో కొల్లగొట్టిందంటూ సోమిరెడ్డి తీవ్ర ధ్వజం

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

దశాబ్దాలుగా పొదలకూరు ప్రజల ఓట్లతో అధికారం అనుభవించిన కాకాణి కుటుంబం ప్రభుత్వ భూములను సైతం బినామీల పేర్లతో కొల్లగొట్టిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలంలోని అయ్యగారిపాలెం, మహమ్మదాపురం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల అక్రమ మైనింగ్ దోపిడీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.