గాంధీ జయంతి వేడుకలు: బాపు ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ఘన నివాళి

రిపోర్టర్: కృష్ణ స్థలం: Hyderabad

హైదరాబాద్లోని బాపు ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. లాంగర్ హౌస్ పరిధిలోని బాపు ఘాట్ వద్ద జరిగిన ఈ వేడుకల్లో ప్రముఖులు అందరూ పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నట్లు తెలంగాణ సీఎంవో అధికారికంగా వెల్లడించింది.