సూరత్ లో దారుణం: మైనర్ బాలుడిపై కర్రలతో దాడి చేసిన దుండగులు
రిపోర్టర్: అశోక్
స్థలం: Surat
గుజరాత్ లోని సూరత్ నగరంలో బాలికతో స్నేహం కారణంగా ఓ మైనర్ బాలుడిపై నలుగురు వ్యక్తులు కర్రలతో కిరాతకంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు తన స్నేహితురాలిని ఇంటి వద్ద దింపిన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని పిలిపించి విచక్షణారహితంగా కొట్టారు. అంతేకాకుండా కులంపేరుతో దూషిస్తూ హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.