కుప్పం స్థానిక ఎన్నికలపై తెదేపా అధినేత చంద్రబాబు దిశానిర్దేశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: చిత్తూరు
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం తెదేపా శ్రేణులు కలిసికట్టుగా విజయం సాధించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉండవల్లి నివాసంలో కుప్పం ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన, ఫలితాల్లో తేడా వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పదవులు తీసుకుని కష్టపడకుంటే కుదరదని, లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. త్వరలో కుప్పంలో రెండు రోజులు పర్యటిస్తానని తెలిపారు.