రాజాపేట మండలంలో పిఏసిఎస్ డైరెక్టర్ చంద్రపాల్ మృతి
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలం బేగంపేట గ్రామానికి చెందిన రేణిగుంట పిఏసిఎస్ డైరెక్టర్ చిగుళ్ల చంద్రపాల్ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఆయన భౌతికకాయంపై పిఏసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు.