అస్సాంలో హైకోర్టు ఆదేశం: బంగ్లాదేశ్ కు పంపిన మహిళల ఆచూకీపై తీవ్ర కసరత్తు
రిపోర్టర్: సతీష్
స్థలం: Guwahati
అస్సాంకు చెందిన ఇద్దరు మహిళలను పొరపాటున బంగ్లాదేశ్ కు పంపిన ఘటనపై గౌహతి హైకోర్టులో విచారణ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఢాకాలోని భారత హైకమిషన్ అక్కడి విదేశాంగ శాఖతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వారి ఆచూకీ, ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోందని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణను నవంబర్ 26వ తేదీకి వాయిదా వేశారు అని అధికారులు తెలిపారు.