వినాయక మండపాల్లో పవిత్రతను కాపాడాలని కోరిన బజరంగ్దళ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలంలో వినాయక మండపాల్లో హిందూ ధర్మాన్ని కించపరిచేలా రీల్స్, వీడియోలు చిత్రీకరించవద్దని బజరంగ్దళ్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ గోగు రవి కోరారు. వినాయకుడు భక్తికి, ఆధ్యాత్మికతకు ప్రతీక అని తెలిపారు. మండపాలు వినోదం కోసం కాకుండా భక్తి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలవాలని సూచించారు. అసభ్యకర హావభావాలు, అనుచిత నృత్యాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. కొన్ని సెకన్ల వైరల్ కంటెంట్ కోసం ధర్మం, సంస్కృతిని విస్మరించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.