ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం వేగంగా అడుగులు వేస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫొటో గుర్తింపుతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. ఈ నెల 11న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రదర్శించనున్నారు. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు.