తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఒడిశాలో పాఠశాలలు, అంగన్వాడీలు బంద్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Odisha
ఒడిశా రాష్ట్రంలో రానున్న తుఫాను ముప్పు నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు రాయగడ, కొరాపుట్, నవరంగ్‌పూర్, గంజాం, పూరి జిల్లాలతో పాటు ఖోర్ధాలో సెలవులు ప్రకటించారు. అక్టోబర్ ఇరవై ఏడు నుంచి పాఠశాలలు బంద్ కానున్నాయని, ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను అక్టోబర్ ముప్పై ఒకటి వరకు రద్దు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.