ఉగ్రవాదంపై పాకిస్థాన్ జర్నలిస్టును నిలదీసిన విదేశీ మంత్రి జైశంకర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: న్యూయార్క్

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో పాకిస్థాన్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఘాటుగా బదులిచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం నుంచి ఈ ప్రశ్న రావడం హాస్యాస్పదమని ఆయన మండిపడ్డారు. న్యూయార్క్లో జరిగిన ప్రెస్ మీట్లో లిబరియా విదేశీ మంత్రితో కలిసి పాల్గొన్న సందర్భంగా ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్ శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని జోక్యం చేసుకుంటూ జర్నలిస్టుకు గట్టి సమాధానం దక్కిందని స్పష్టం చేశారు.