పామూరు మండలంలో బిజెపికి షాకిచ్చిన నాయకుడు విజయ్ కుమార్ చారి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పామూరు

మార్కాపురం జిల్లా పామూరుకు చెందిన బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా నాయకుడు పెరమన విజయ్ కుమార్ చారి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కు, జిల్లా అధ్యక్షులు కృష్ణారావుకు పంపారు. గత పదమూడేళ్లుగా వివిధ హోదాల్లో పార్టీ కోసం పనిచేశానని, కొన్ని వ్యక్తిగత మరియు అనివార్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.