కడప జిల్లాలో పరిషత్ పోలింగ్ హింసాత్మకం: పెట్రోల్ బాంబుల దాడితో ఉద్రిక్తత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Kadapa
పరిషత్ ఎన్నికల పోలింగ్ వేళ వైఎస్సార్ కడప జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. పులివెందుల మండలం ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘర్షణలో పెట్రోల్ బాంబులు విసరడంతో భారీగా మంటలు చెలరేగాయి. వివిధ ప్రాంతాలలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగగా, అప్రమత్తమైన పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపులను చెదరగొట్టారు. ఎన్నికల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.