ఎర్ర సముద్రంలో వ్యూహాత్మక ద్వీపాలను స్వాధీనం చేసుకున్న హూతీలు

రిపోర్టర్: విజయ్ స్థలం: World

యెమెన్‌లోని హూతీ రెబెల్స్ దక్షిణ ఎర్ర సముద్రంలో పట్టు బిగిస్తున్నారు. బాబ్ ఎల్ మండేబ్ జలసంధికి ఉత్తరాన ఉన్న గ్రేటర్ హనీశ్, లెసర్ హనీశ్ వ్యూహాత్మక ద్వీపాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో ప్రధాన సముద్ర నౌకా రవాణా మార్గంపై వారి నియంత్రణ మరింత బలోపేతమైంది. ఈ విషయాన్ని యెమెన్ ప్రభుత్వం, హూతీ వర్గాలు ధృవీకరించాయి.