స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగమైన తెలంగాణ గ్రామీణ బ్యాంక్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం అర్బన్
ఖమ్మం శ్రీనగర్ కాలనీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్లో ‘స్వచ్ఛతా హి సేవా–2026’లో భాగంగా ‘ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్’ కార్యక్రమం నిర్వహించారు. బ్రాంచ్ మేనేజర్ జి.సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది శ్రమదానం చేసి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్లు ఎస్.శ్రావణి, ఎస్.దివ్యవాణి, క్యాషియర్లు నవీన్ కుమార్, దిలీప్ కుమార్, అటెండర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.