గణపతి నిమజ్జన వేళ విద్యుత్ సమస్యలకై ప్రత్యేక కంట్రోల్ రూమ్
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
గణపతి నిమజ్జనం వేళ విద్యుత్ సమస్యలు తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నట్లు ఖమ్మం సర్కిల్ ఎస్ఈ శ్రీనివాసచారి స్పష్టం చేశారు. నేలకొండపల్లిలో నిమజ్జన మార్గాల్లో వైర్ల అడ్డంకులు తొలగించాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసరాలకు 8712483490, టోల్ ఫ్రీ 1912 నంబర్లలో సంప్రదించాలని కోరారు. భక్తులు, మండపాల నిర్వాహకులు విద్యుత్ లైన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.