మహిళపై దాడి చేసిన హోంగార్డు విధుల నుంచి తొలగింపు
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో విధి నిర్వహణలో ఓ మహిళపై దాడి చేసి జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన హోంగార్డు ఆనంద్‌ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ విధుల నుంచి తొలగించారు. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మియాపూర్ పోలీసులు అతడిపై సుమోటోగా కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.