భారీ గాలివానకు బూసిపుట్టులో కూలిపోయిన నిరుపేద కుటుంబ ఇల్లు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: ముంచింగిపుట్టు

ముంచింగిపుట్టు మండలంలోని బూసిపుట్టు గ్రామానికి చెందిన రావెల సూరిబాబు కుటుంబం నివసిస్తున్న ఇల్లు గురువారం రాత్రి వీచిన భారీ గాలులు, ఎడతెరిపిలేని వర్షానికి పూర్తిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇల్లు నేలమట్టం కావడంతో బాధితులు తీవ్ర ఆవాస సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.