ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయవాడ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన బందోబస్తు, దర్శన ఏర్పాట్లు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక సూచనలు చేసినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.