పాలకుల నిర్లక్ష్యపు వైఖరితో విస్మృతమవుతున్న తెలంగాణ విమోచన చరిత్ర

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని టేకులబస్తీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రజలను వంచించాయని ఆరోపించారు. విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాచర్ల సంతోష్కుమార్, వైద్య శ్రీధర్, ధార కళ్యాణి, దూది ప్రకాష్, జీదుల రాములు, నల్లుల సంగీత, ఎర్రోజు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.