ఆయుష్మాన్ భారత్ తో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: New Delhi
ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ పథకం దేశంలో సేవలు అందిస్తోంది. వైద్య సేవలను మరింత సులభతరం, అందుబాటులోకి తీసుకురావడంతో పాటు దేశవ్యాప్తంగా అరవై కోట్లకు పైగా లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.