వైఫల్యాలు, మద్యపాన వ్యసనం నుంచి బయటపడ్డానని వెల్లడించిన స్టార్ స్పిన్నర్ చాహల్

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాలు, విడాకులు, తీవ్రమైన మద్యపాన వ్యసనం కారణంగా తాను తీవ్రమైన మానసిక క్షోభను అనుభవించానని భారత స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా నిర్వహించిన పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, తన జీవితం దారితప్పుతున్న సమయంలో రిహాబిలిటేషన్ సెంటర్లో చేరి ఇరవై ఆరు రోజుల పాటు చికిత్స తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ కీలక నిర్ణయం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని ఆయన వెల్లడించారు.