టెక్ ప్రేమికులకు గుడ్ న్యూస్: వివో ఒరిజిన్ ఓఎస్ 7 లాంచ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: Andhra Pradesh / Telangana

భారతీయ మార్కెట్లోకి వివో ఒరిజిన్ ఓఎస్ సెవెన్ త్వరలో రానుందని ప్రముఖ టెక్ రివ్యూయర్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు హ్యాండిల్ ద్వారా ప్రసాద్ తెలిపారు. సరికొత్త యూజర్ ఇంటర్ఫేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెరుగైన పనితీరుతో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వస్తోందని పేర్కొన్నారు. ఫ్లూయిడ్ మోషన్, స్ప్రింగ్ యానిమేషన్లతో పాటు జోవి ఏఐ, జెమిని ఆధారిత రికార్డర్, స్నాప్ నోట్, ఏఐ సెర్చ్ ఫీచర్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు.