దీపావళి బాణసంచా దుకాణాల ఏర్పాటుకు అగ్నిమాపక శాఖ కీలక మార్గదర్శకాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు తప్పనిసరిగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని ఫైర్ సర్వీస్ లైసెన్స్ పొందాలని అగ్నిమాపక శాఖ అధికారులు స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించడంతో పాటు ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు పేర్కొన్నారు.