అన్నదైవం చెరువుకు చేరిన సీతారామ ప్రాజెక్టు గోదావరి జలాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలోని అన్నదైవం చెరువుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు చేరుకున్నాయి. చెరువులోకి నీరు రావడంతో రెండు పంటలకు సాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుగ్గల నరసింహారావు, సున్నం సమ్ములు, పలగాని నాగేంద్రబాబు, పాడియా జోగారావు, లాకావత్ సత్యనారాయణ, మల్లెల స్వామి, వడ్డే నరసింహారావు, ఇజ్జిగిరి సత్యం తదితరులు పాల్గొన్నారు.