భారత క్రికెటర్లు యంత్రాలు కారు: సునీల్ గవాస్కర్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: India

భారత క్రికెటర్లపై పెరుగుతున్న పనిభారంపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆటగాళ్లు యంత్రాలు కారు, రసం పిండేయడానికి చెరుకు గడలు కారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరుస సిరీస్‌ల వల్ల ఆటగాళ్లు తీవ్ర గాయాల బారిన పడుతున్నారని, ఐసీసీ తదుపరి షెడ్యూల్ రూపకల్పనలో ఈ అంశాన్ని పరిశీలించాలని ఆయన హితవు పలికారు.