ఢిల్లీ బ్రిక్స్ సదస్సులో విదేశీ నేతలకు ప్రత్యేక విందు ఏర్పాట్లు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఢిల్లీ
న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటున్న విదేశీ ప్రతినిధులు మరియు దేశాధినేతల కోసం భారత్ ఘనంగా ఆతిథ్య ఏర్పాట్లు చేసింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాంప్రదాయ వంటకాలను మెనూలో చేర్చారు. ఇందులో ప్రత్యేకంగా హైదరాబాద్ బిర్యానీ, రాగి దోసెలతో పాటు సిరిధాన్యాలతో తయారు చేసిన వంటకాలను ప్రపంచ నాయకులకు వడ్డించనున్నారు.