ఏనుగుల దాడి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: పార్వతీపురం మన్యం

పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో ఏనుగుల సంచారంతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. నులకజోడు తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల పంటలు ధ్వంసమయ్యాయని, ఎకరాకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.