నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఎస్ఎస్సీ జీడీ పరీక్ష ఫైనల్ కీ విడుదల

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

కేంద్ర బలగాల కానిస్టేబుల్ పరీక్షల తుది కీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్ సైట్ లో అభ్యర్థులు నవంబర్ పదిహేడో తేదీ వరకు రెస్పాన్స్ షీట్లు, మార్కులను డౌన్ లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. సీబీటీ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ వివరాలతో లాగిన్ అయి మార్కులు, ప్రశ్నాపత్రాలను చూసుకోవచ్చని స్పష్టం చేశారు.