నర్శింగోలులో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి డోలా స్వామి

రిపోర్టర్: అశోక్ స్థలం: ప్రకాశం

సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన కోసం ప్రకాశం జిల్లా జరుగుమళ్ళ మండలం నర్శింగోలులో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్, ప్రజా వేదిక స్థలాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని మంత్రి స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.