నాయుడుపేటలో ఘనంగా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

రిపోర్టర్: నరేష్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని గోమతి సెంటర్ సమీపంలోని ఏవీ రెసిడెన్సీలో నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాలిటీల ఎన్నికల సన్నాహక సమావేశం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ సమావేశంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మరియు ముఖ్య నేత నూకసాని బాలాజీ తదితరులు పాల్గొని దిశానిర్దేశం చేశారు.