'తిరుపతిలో స్కైవాక్ ఏర్పాటు చేస్తాం': టీడీపీ వెల్లడి
రిపోర్టర్: రాము
స్థలం: Tirupati
తిరుపతిలో రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు స్కైవాక్ ఏర్పాటు చేయనున్నట్లు Telugu Desam Party (TDP) ప్రకటించింది. కేంద్ర సహకారంతో త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపడతామని వెల్లడించింది. అలాగే ఇటీవల సేకరించిన 50 ఎకరాల భూమిలో ప్రయాణికులు, భక్తుల సౌలభ్యం కోసం మల్టీస్టోరీడ్ పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా తిరుపతిలో రద్దీని తగ్గించి, మెరుగైన వసతులు కల్పిస్తామని పార్టీ స్పష్టం చేసింది.