విద్యుత్తు పనుల్లో సిబ్బందికి సాయం చేస్తూ వ్యక్తి దుర్మరణం

రిపోర్టర్: హరి స్థలం: తెర్లాం

తెర్లాం మండలంలోని గొలుగువలసలో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ పనులకు సాయం చేసేందుకు వెళ్లిన కాబోతుల పోలిరాజు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అప్పలంపేట గ్రామానికి చెందిన పోలిరాజు తీగలు లాగుతుండగా స్తంభం కూలి తీగలు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బి.సాగర్బాబు పేర్కొన్నారు. కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న పోలిరాజు మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.