ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వర్ణ భారత్ ట్రస్ట్ సందర్శనకు విస్తృత ఏర్పాట్లు
నెల్లూరు జిల్లా : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌ను సందర్శించనున్న నేపథ్యంలో కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ సందర్భంగా వెంకటాచలంలోని అక్షర విద్యాలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.
ఈనెల 7వ తేదీ సోమవారం ఉదయం 11.30 గంటలకు వెంకటాచలంలోని అర్జున గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుని, అదే క్యాంపస్‌లోని అక్షర విద్యాలయం అడ్మిన్ భవనానికి వెళ్లనున్నారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి, అడ్మిన్ భవనం నుంచి విద్యార్థులను కలుసుకుని వారికి అభివాదం చేయనున్నారు. ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య స్కేటింగ్ రింక్/ఆడిటోరియం వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, విద్యార్థుల స్వాగత కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సోమా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను సందర్శిస్తారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం 1.45 గంటలకు అక్షర విద్యాలయం నుంచి స్వర్ణ భారత్ ట్రస్ట్ కు చేరుకుని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి అక్షర విద్యాలయానికి, 3.35 గంటలకు అర్జున గ్రౌండ్‌కు చేరుకుని, 3.40 గంటలకు హెలిప్యాడ్ నుంచి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ బయలుదేరుతారు.